NTV Telugu Site icon

Viral Video: కారుతో స్టంట్‌ చేయబోయి.. స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది!

Us Women Doing Risky Stunt

Us Women Doing Risky Stunt

Today Google Trending Viral Video: సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తున్నారు. ఈ స్టంట్‌లు ఒక్కోసారి ఫెయిల్ అవ్వడంతో వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇంలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువతి స్టంట్‌ చేయబోయి.. తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది.

వివరాల ప్రకారం… కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్‌ ముందున్న పార్కింగ్‌ ప్రాంతంలో ఓ యువతి ఎస్‌యూవీ కారును ప్రమాదకరంగా నడపగా.. అది కాస్తా బోల్తా పడింది. 5-6 యువతీ యువకులు కారు డోర్లపై వేలాడుతుండగా.. యువతి కారును వేగంగా వెనక్కి తిప్పడంతో పల్టీకొట్టింది. దీంతో కారు డోర్లపై నిల్చున్న వారు కారు కింద పడి నలిగిపోయారు. ఈ స్టంట్‌ను వీడియో తీస్తున్న వారు హుటాహుటిన పరుగెత్తుకువచ్చి కారు కింద పడిపోయిన వారిని రక్షించారు.

Also Read: IPL 2024 Auction: చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో సిరిసిల్ల కుర్రాడు!

ఈ ఘటనకు సంబంధించి కొలరాడో స్పింగ్స్‌ పోలీసులు స్పందించారు. ఈ ప్రమాదానికి కారణమైన యువతిని అరెస్టు చేశామని, నిర్లక్ష్య పూరితంగా డ్రైవ్‌ చేసినందుకు కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేసిన యువతికి స్వల్ప గాయాలు కాగా.. కారు కింద పడ్డవాళ్లకి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారట. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగినట్లు సమాచారం తెలుస్తోంది.

Show comments