IPL 2024 Auction: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సిరిసిల్ల కుర్రాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Buy Telangana Cricketer Aravelly Avinash Rao in IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన క్రికెటర్‌కు అవకాశం దక్కింది. మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్‌ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, వికెట్ కీపర్‌ని సీఎస్‌కే కొనుగోలు చేసింది.
అవనీశ్ రావుది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచకప్‌కు అవనీశ్ ఎంపికయ్యాడు. అవనీశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్. ఈ ఏడాది నవంబర్‌లో అండర్-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్-ఏ తరఫున ఆడిన అవనీశ్.. భారత్-బిపై 93 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 12 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయినా చెన్నై మేనేజ్‌మెంట్ వేలంలో అతడిని కొనుగోలు చేసింది. ఇటీవలే విజయ్‌హజారె ట్రోఫీలో హైదరాబాద్ తరఫున సర్వీసెస్‌పై లిస్ట్-ఏ అరంగేట్రం చేశాడు.
Also Read
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
Also Read: SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
ఇప్పటికే ఆంధ్రకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు అవనీశ్ చెన్నై జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమ్ భవిష్యత్తుకు చెన్నై బాటలు వేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ ఉన్న చెన్నై తుది జట్టులో మనోడికి అవకాశం వస్తుందో చూడాలి. ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 11 మంది తెలుగు ఆటగాళ్లు బరిలో నిలవగా.. కేఎస్ భరత్, అవనీశ్ రావు మాత్రమే అమ్ముడయ్యారు. మిగతా 9 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!