తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ దగ్గర ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మారేడుమిల్లి వద్ద గుడిసె విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటికి తీశారు. మృతులు ఉదయ్ కిరణ్, హేమంత్, హర్షవర్థన్ అనే విద్యార్థులుగా గుర్తించారు. పదిమంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
Read Also: Vikarabad: డబ్బులే కాదు… అప్పుడప్పుడు జర జనాల ప్రాణాలు కూడా చూడుర్రి డ్రైవర్ బ్రో
అయితే, ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నాట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ తో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, మారేడుమిల్లిని చూసేందుకు నిన్న ఉదయం ఏలూరు నుంచి ఆరుగురు బయలుదేరారు. వీరు ఏలూరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మారేడుమిల్లి తదతర ప్రాంతాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 11 గంటల టైంలో కోరుకొండ దాటుతుండగా ప్రమాదం జరిగింది. కల్వర్టు పైకెక్కే క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ లోతుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటికి తీశారు.
Read Also: Toll Collection: రికార్డ్ స్థాయికి చేరుకున్న టోల్ కలెక్షన్.. రూ.4వేల కోట్లు దాటిన నెలవారీ వసూళ్లు
ఇక, వీరు 20 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు అని పోలీసులు చెప్పారు. కేవలం మారేడుమిల్లిని చూసి వచ్చేందుకు వచ్చారు.. ఈ ప్రమాదం నుంచి ప్రణీత్, వంశీ, హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు అని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.