Site icon NTV Telugu

Warangal: తీవ్ర విషాదం.. ఎస్సార్ఎస్పీ కాలువలో పడ్డ కారు, నలుగురు గల్లంతు

Car

Car

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తో పాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు మృతి చెందగా.. భార్యను స్థానికులు కాపాడారు. వరంగల్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది.

Read Also: MEGA FAMILY : మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ ముచ్చట్లు

దీంతో ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. అప్పటికే బాబు మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు కారు సహా నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్‌కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్‌లో దూసుకెళ్లి పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రి, కూతురు కోసం స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.

Read Also: US: కేబినెట్ భేటీలో ట్రంప్ ఎదుటే ఎలోన్ మస్క్-విదేశాంగ కార్యదర్శి మధ్య ఘర్షణ

Exit mobile version