NTV Telugu Site icon

Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు

Car (1)

Car (1)

Fire : ఇటీవల కాలంలో ఉన్నట్లుండి కార్లు దగ్ధమవుతున్నాయి. సాంకేతిక లోపాల కారణంగానో లేక, మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఇన్నట్లుండి కార్లు మండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కార్లు రోడ్లపై నడుస్తుండగానే మంటలు అంటుకోవడంతో కొన్ని ఘటనలో ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది.
తాజాగా.. హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో త్రుటిలో ప్రాణ నష్టం తప్పింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1లో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్‌ అందులోనుంచి దిగిపోయాడు. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలోని స్థంభాల గరువు నర్సిరెడ్డి పాలెంలో అనుమానాస్పదంగా మూడు కార్లు దగ్దం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పార్క్ చేసిన కార్లలో మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే.. దీనిపై వెంటనే స్థానికులు పోలీసులతో పాటు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే.. దీంతో వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలార్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Adani : గంగవరం 100శాతం అదానీదే.. ఆల్ క్లియర్