Hyderabad: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని P&T కాలనీ రోడ్ నంబర్ 2లో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా, ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. టపాసులు కారు కిందికి వెళ్లి పేలడంతో కారు కింద భాగం నుంచి మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం కాలిపోయింది. ఇక, స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
Read Also: Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు
ఇక, ఈ ఘటన అర్థరాత్రి సమయంలో జరగడంతో కారు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.. ప్రజలకు ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు పాటించి పండగను సెలబ్రేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
