Car Accident: మంటల్లో కాలి బూడిదైన కారు.. సికింద్రాబాద్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినప్పటికీ, కారు మొత్తం కాలిబూడిదైంది. కాగా.. కారు మొత్తం కళ్ళముందే అగ్నికి ఆహుతి అవ్వడంతో కారు యజమాని కన్నీరు మున్నీరయ్యారు. యజమాని బాపూజీనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అప్పుడే కారును రిపేర్ చేయించుకోని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read
- Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
- Jammu Kashmir: ఇద్దరు పోలీసుల దారుణహత్య.. హిజ్బుల్ టెర్రరిస్ట్ సహా ముగ్గురిపై రూ. 30 లక్షల రివార్డ్!
- Will Young: నేను 125 పరుగులు చేసినా వేస్ట్ అయింది.. విల్ యంగ్ ఆవేదన..
- Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక ప్రకటనలు!
తాజావార్తలు
-
Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
-
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల దారుణహత్య.. హిజ్బుల్ టెర్రరిస్ట్ సహా ముగ్గురిపై రూ. 30 లక్షల రివార్డ్!
-
Will Young: నేను 125 పరుగులు చేసినా వేస్ట్ అయింది.. విల్ యంగ్ ఆవేదన..
-
NTRxTrivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్‌తో ఫ్యాన్స్ ఖుష్!
-
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?