సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినప్పటికీ, కారు మొత్తం కాలిబూడిదైంది. కాగా.. కారు మొత్తం కళ్ళముందే అగ్నికి ఆహుతి అవ్వడంతో కారు యజమాని కన్నీరు మున్నీరయ్యారు. యజమాని బాపూజీనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అప్పుడే కారును రిపేర్ చేయించుకోని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Car Accident: మంటల్లో కాలి బూడిదైన కారు.. సికింద్రాబాద్లో ఘటన

Car Fire