Site icon NTV Telugu

Terrible Accident Video : ఇది ఎలా జరిగింది.. మీకు అర్థమైతే చెప్పండి

New Project (12)

New Project (12)

Terrible Accident Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరం అనిపిస్తుంటాయి. కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉంటాయి. ఘోర ప్రమాదాల వీడియోలను చూసినప్పుడు చాలామంది షాక్‌కు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘోర ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నంతున్నాయి. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ కారు యాక్సిడెంటుకు గురైనట్లు కనిపిస్తోంది. అసలు ఆ కారుకు ప్రమాదం ఎలా జరిగిందో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత, ప్రమాదం ఎలా జరిగిందో కామెంట్‌లో తెలియజేయండి.

Read Also: Karnataka Election: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూకుడు

ఆ కారు ప్రమాదం వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత మీ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అది జరిగితే ఎలా జరిగిందో. ప్రమాదానికి గురైన కారు నేరుగా పిల్లర్‌పై ఎలా పడిందని ఆలోచిస్తారు. ఇప్పటికే వీడయోని చూసిన వారు కారు ఆకాశం నుండి పడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను @ClownWorld_ అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. నిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని 5.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version