Site icon NTV Telugu

Road Accident: యువకుల కారు సరదా.. రోడ్డుపక్క నిలబడిన వ్యక్తి మృతి

Road Accident

Road Accident

కొంతమంది యువకుల సరదా జనానికి ప్రాణం మీదకి తెచ్చింది. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ముగ్గురు యువకులు సరదాగా రోడ్డు పక్క నిలబడిన ఒక వ్యక్తి ప్రాణం తీశారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు సమీపంలో ఖాళీగా ఉన్న ఒక ప్రయివేట్ లే అవుట్ లోని కందరాడకు చెందిన ముగ్గురు యువకులు కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుటుండడంతో బ్రేకు నొక్కబోయి ఎక్సలెటర్ నొక్కగా అదుపుతప్పి రోడ్డుప్రక్క బైకు పార్క్ చేసి కూలీలతో మాట్లాడుతున్న గొర్ల సత్తిబాబును ఢీకొట్టి ప్రక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసికెళ్లింది.. సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, స్వల్ప గాయాలతో మరో ఇద్దరు తప్పించుకున్నారు.

Read Also: Constable Exams: కానిస్టేబుల్ పరీక్షలు.. వీటిని తీసుకురావద్దు

స్థానిక జగ్గయ్య చెరువుకు చెందిన మృతుడు సత్తిబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. నర్సీపట్నం బిల్డింగ్ కాంట్రాక్టు తీసుకుని కూలీలను తీసుకెళ్లేందుకు ఫోన్ చేసి అక్కడకి రమ్మని వారితో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది… కారులో ఉన్న ముగ్గురు మద్యం మత్తులో జన్నారు అని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు… పండుగ అనంతరం మళ్ళీ పనికి వెళ్లే క్రమంలో ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఇద్దరు పిల్లలు తో కుటుంబం రోడ్డున పడిందని సత్తిబాబు భార్య రోదిస్తుంది. తమకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Used Car Sale : తక్కువ ధరలో, అన్ని పత్రాలతో పాత కారు వెంటనే కొనేయండి

Exit mobile version