NTV Telugu Site icon

Car Accident: వామ్మో.. కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లిన కారు.. వైరల్ వీడియో..

Car Accident

Car Accident

ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు కూడా కారులోనే ఇరుక్కుపోయాయి.

Also read: Faria Abdullah: యెల్లో శారీలో అదరగొడుతున్న చిట్టి.. నెటిజన్స్ ఫిదా..

ఇక ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫ్యూటేజ్ ను తాజాగా పోలీసులు విడుదల చేశారు. సంఘటన స్థలం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సిసిటీవీలో ప్రమాద సంఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ కిందికి కారు అతి వేగంతో దూసుకెళ్లింది. వీడియో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది.

Also read: Actress Injured: జిమ్‌లో జాగ్రత్త.. ప్రముఖ టీవీ నటికి తీవ్ర గాయం!

ఇక కారులో ప్రయాణిస్తున్న మృతులను నవీన్ రాజా, భార్గవిలుగా పోలీసులు గుర్తించారు. వీరు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారును అతి కష్టం మీద బయటకు తీశారు అధికారులు. బయటికి తీసిన మృత దేహాలను పోస్టుమార్టం కొరకు కోదాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నవీన్ రాజా విజయవాడ నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments