Actress Injured: జిమ్‌లో జాగ్రత్త.. ప్రముఖ టీవీ నటికి తీవ్ర గాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Actress Krystle Dsouza Knee Injury In Gym: ఈ మధ్య కాలంలో చాలా మందిలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. అందుకే ఎక్కువగా వ్యాయామం చేసేందుకు జిమ్ బాట పడుతున్నారు. అయితే జిమ్ లో వ్యాయామం చేసేటప్పుడు జిమ్ ట్రైనర్ ఖచ్చితంగా ఉండాలి. వారు లేకుండా చేస్తే గాయాల పాలు కావడం తప్పదు. తాజాగా అలాగే ఒక నటి గాయాల పాలు అయినట్టు స్వయంగా వెల్లడించింది. హిందీ బుల్లితెర మీద ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై’ వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించిన క్రిస్టల్ డిసౌజాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా క్రిస్టల్ డిసౌజా గాయపడింది. మోకాలిలో విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే క్లినిక్‌కి వెళ్లి అక్కడ నుంచి ఆమె తన ఫొటోలను షేర్ చేసి హెల్త్ అప్‌డేట్ ఇవ్వడంతో వైరల్ అవుతోంది. 2007లో ‘కహెన్ నా కహెన్’ సినిమాతో నటనా రంగంలోకి అడుగుపెట్టిన క్రిస్టిల్ డిసౌజాకి ఏప్రిల్ 20న ఈ గాయం అయినట్టు తెలుస్తోంది.
Salman Khan House Firing : నదిలో దూకి క్రైం బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
రోజూ లాగే శనివారం కూడా వర్కవుట్ చేయడానికి జిమ్‌కి వెళ్లింది. అకస్మాత్తుగా ఆమెకు మోకాళ్ల దగ్గర ఇబ్బంది అనిపించింది, తరువాత, తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. ఇక ఈ క్రమంలో క్రిస్టల్ టైమ్స్ నౌ ఇండియాతో మాట్లాడుతూ, ‘జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయమైంది.’ ఇక వెంటనే వైద్యం కోసం క్లినిక్‌కి తీసుకెళ్లారు అని పేర్కొంది. ఇక ఇప్పుడు ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే కొంత ఉపశమనం లభించిందని ఆమె తెలిపారు. అయితే తనకు మందులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు కానీ ఈ సమయంలో తినక తప్పడం లేదని ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చింది. క్రిస్టల్ ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై’ సీరియల్‌లో జీవికా వధేరా అనే పాత్రను పోషించడం ద్వారా గుర్తింపు పొందింది. ఇది కాకుండా, ఆమె ‘ఏక్ నయీ పెహచాన్’, ‘బెలన్ వాలీ బహు’ వంటి సీరియల్స్ లో కూడా కనిపించింది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!