NTV Telugu Site icon

Ganja Smuggling : పుష్పను మించిన ప్లాన్‌.. కానీ చివరికి..

Cannabis

Cannabis

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనంను స్మగ్లింగ్‌ చేసే విధానం చూసే ఉంటారు. కానీ.. ఈ సంఘటన అంతకు మించి అన్నట్లుగా ఉంది. అల్లూరి జిల్లాలో ఈ స్మగ్లింగ్‌ గుట్టు రట్టు చేశారు పోలీసులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రెండు ఖరీదైన కార్ల.. కార్ల డోర్లలో గంజాయి ప్యాకెట్లను అమర్చారు. అయితే.. జిల్లాలోని పాడేరు నుంచి తరలించేందుకు ప్లాన్‌ వేశారు. కానీ వారి ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు కలిగి ఉన్న ఫోర్డ్‌, స్కార్పియో వాహనాలను పాడేరులో పోలీసులు ఆపి తనిఖీలు చేశారు.

అయితే.. ఈ తనిఖీల్లో గంజాయి లభ్యమైంది. పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ గంజాయి విలువకంటే.. కార్ల విలువే ఎక్కువ అని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కల్లుగప్పి పారిపోతుండగా.. పాడేరులో తెల్లవారు జామున చేజ్ చేసి ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కొందరు తప్పించుకున్నట్లు వారి కోసం గాలిస్తున్నామన్న పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.