Site icon NTV Telugu

Yogi Adityanath: “గాజా” కోసం కన్నీరు కారుస్తారు, “బంగ్లాదేశ్ హిందువు” కోసం మాట్లాడరు…

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ .. ‘‘బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని చంపారు. కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు.

Read Also: Shivaji Press Meet: నేను ఎవ‌రితోనూ మిస్ బిహేవ్ చేయ‌లేదు.. నా భార్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాను..

‘‘మీరు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తారు, అందుకే మీరు మాట్లాడరు. బంగ్లాదేశ్‌లో ఒక యువ దళిత వ్యక్తిని ఎలా సజీవ దహనం చేశారో చూడండి. గాజా స్ట్రిప్‌లో జరిగే దేనికైనా మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు, దళిత వ్యక్తి విషయంలో మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాదు, మీ నాలుకలు మూగబోయాయి. మీరు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగిస్తారు’’ అని యోగి అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమైంది మీ బుజ్జగింపు విధానమే అని మండిపడ్డారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లో భాగం కాకుంటే హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదని ఆయన అన్నారు. గాజా కోసం కొవ్వత్తుల ప్రదర్శన, హిందువుల విషయంలో మౌనం వహిస్తారని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని చంపినప్పుడు ప్రతిపక్షాలు స్పందించవని, బంగ్లాదేశ్‌లో మరణించిన వ్యక్తి హిందువు కాబట్టి మీరు మాట్లాడరని అన్నారు.

అక్రమ వలసదారుల గురించి యోగి హెచ్చరించారు. తాము బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను బహిష్కరించినప్పుడు వారికి మద్దతు ఇవ్వకండి, మీరు చాలా మంది బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డ్‌లు తయారు చేయించి పాపం చేశారని, తాము వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి ముందు యోగి ఆక్రమణలపై మాట్లాడుతూ.. ఏ స్మారక చిహ్నాన్ని, ఏ పురాతన ప్రదేశాన్ని ఆక్రమించినా, అది ఎవరైనా వారిని నేను వదిలిపెట్టనని హెచ్చరించారు.

Exit mobile version