Site icon NTV Telugu

Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని హసీనా మరణశిక్షను ఆపగల మార్గాలు ఇవే..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. కోర్టు ఆమెను మూడు తీవ్రమైన అభియోగాలపై దోషిగా నిర్ధారించి ఈ విధంగా తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఆమె దోషిగా నిర్ధారించినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆమెకు ఎప్పుడు ఉరిశిక్ష అమలు చేస్తారనేది కోర్టు వెల్లడించలేదు. ఆమె ఈ శిక్షపై అప్పీల్ చేసుకోవచ్చా, దీని నుంచి తప్పించుకోవడానికి ఆమెకు చట్టపరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఆలయ పాలకమండలి కీలక భేటీ!

భారత్‌లో హసీనా..
షేక్ హసీనా ఒక సంవత్సరానికి పైగా భారతదేశంలో ఉంటున్నారు. ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు తర్వాత ఆమె ఢిల్లీకి వచ్చారు. నాటి నుంచి కూడా ఆమె ఇక్కడే ఉన్నారు. ఇటీవల ఆమె బంగ్లా నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి భారత మీడియాకు సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆమె పాలనలో నిరసనలను ప్రేరేపించి, ఫలితంగా మరణాలు సంభవించాయనే ఆరోపణలపై ఆమెపై బంగ్లాదేశ్‌లో కేసు నమోదు చేశారు. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనల్లో సుమారుగా 1,400 మంది మరణించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుంది. తాజాగా నవంబర్ 17 న ఢాకాలోని ICT ఈ కేసు విచారణలో భాగంగా ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే షేక్ హసీనా ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయా? ఈ శిక్షకు వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేయగలరా? అనేది తెలుసుకుందాం..

అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది..
ఈ శిక్షపై అప్పీల్ చేసుకోడానికి షేక్ హసీనాకు అవకాశం ఉంది. 1973 ఐసీటీ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం.. ఆమె 60 రోజుల్లోపు బంగ్లాదేశ్‌లో ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలి. ఈ తీర్పు వెలువడిన 60 రోజుల్లోపు హసీనా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్‌లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హసీనా భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు. కాబట్టి ఆమె తన న్యాయవాదుల ద్వారా ఈ అప్పీల్ దాఖలు చేయవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఆమెను కోర్టుకు హాజరు కావాలని కోరవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే షేక్ హసీనా 60 రోజుల్లోపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేయకపోతే, శిక్ష తుది అవుతుంది. అంటే ఈ శిక్షను అమలు చేయాలని పరిగణిస్తారు. ఒకవేళ ఆమె అప్పీల్ విజయవంతమైతే, కొత్త విచారణ లేదా శిక్ష తగ్గింపు చేయవచ్చని చెబుతున్నారు.

బంగ్లాదేశ్ ఐసీటీ తీర్పును నేరుగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీకి లేదా న్యాయమైన విచారణ సమస్యలపై ఫిర్యాదు దాఖలు చేసిన ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా అప్పీల్ చేయవచ్చు. కానీ ఇది చట్టపరమైన అప్పీల్‌గా పరిణగించబడదు. మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు అవుతుంది, ఇది శిక్షను నిలిపివేయడం లేదా రద్దు చేయలేదు. ఐసీటీ అంటే బంగ్లాదేశ్ దేశీయ ట్రిబ్యునల్ అని అర్థం. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలను విచారించడానికి దీనిని స్థాపించారు. ICT ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ జాతీయ న్యాయ వ్యవస్థలో ఒక భాగం. అయితే జాతీయ ట్రిబ్యునల్‌లలో దోషులుగా తెలిన నిందితులకు అప్పీల్ చేసుకునే హక్కును ఇది అందిస్తుంది.

హసీనాను భారత్‌లో  అరెస్టు చేయవచ్చా..
ప్రస్తుతం హసీనా భారతదేశంలో దేశంలో ఉన్నారు. కాబట్టి ఆమెను అరెస్టు చేయకపోతే లేదా అప్పగించకపోతే, ఆమె దేశం వెలుపల ఉండటం వల్ల ఆమెకు అప్పీల్ చేయడం కష్టం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఆమె లేనప్పటికీ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆమె శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్‌ను అంగీకరిస్తే, ఆమె శిక్షను రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

READ ALSO: Balakrishna : ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణకి సన్మానం

Exit mobile version