iPhone Call Recording: ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18.1 యొక్క మొదటి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకత యాపిల్ ఇంటెలిజెన్స్. ఈ అప్డేట్ లో మరెన్నో ప్రత్యేక ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి. ఇది వినియోగదారులకు చాలా సహాయపడుతుంది. ఈ అప్డేట్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ చేయగలుగుతారు. ఈ అప్డేట్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఫీచర్ల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాము.
Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..
ఆపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఫోన్ లు, కంప్యూటర్ లను మరింత స్మార్ట్‌గా మార్చే కొత్త టెక్నాలజీ. ఈ అప్డేట్ లో, ఆపిల్ వ్రాతపూర్వకంగా సహాయం చేయడానికి కొత్త ఫీచర్ ను అందించింది. ఈ ఫీచర్ మీ వ్రాసిన దానిని తనిఖీ చేయడంలో, ఇందులో ఏదైనా తప్పులను గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది. ఈ ఫీచర్ ప్రూఫ్ రీడింగ్ లా సహాయపడుతుందని అర్థం. అలాగే, ఈ ఫీచర్ ఏదైనా రాసినదానిని అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ టెక్స్ట్ లోని ముఖ్యమైన అంశాలను హైలైట్ చేస్తుంది. తద్వారా మీరు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత..!
ఫోటో యాప్ లో కూడా మార్పులు చేయబడ్డాయి. ఇప్పుడు మీరు మీ ఫోటో నుండి ఆటోమేటిక్ వీడియోని సృష్టించవచ్చు. మీకు కావాలంటే మీరు ఈ వీడియోలో కూడా మార్పులు చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఇప్పుడు ఫోటోల యాప్ లో పదాలతో చిత్రాలను శోధించవచ్చు. దీనితో పాటు సఫారీ బ్రౌజర్ లో కూడా మార్పులు చేయబడ్డాయి. వెబ్ సైట్ గురించి కొంచెం సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఫోన్ యాప్‌లో కాల్స్ రికార్డింగ్ చేసే ఫీచర్ వచ్చేసింది. మీరు ఈ రికార్డింగ్ లను నోట్స్ యాప్‌లో టెక్స్ట్ రూపంలో కూడా మార్చవచ్చు. ఈ ఫీచర్లన్నీ మీ ఫోన్ లో మాత్రమే పనిచేస్తాయని, మీ సమాచారం సురక్షితంగా ఉంటుందని కూడా ఆపిల్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త అప్డేట్ ఐఫోన్ 15 Pro, iPhone 15 Pro Maxలో మాత్రమే పని చేస్తుంది. ఎందుకంటే., వాటికి ప్రత్యేక రకం చిప్ ఉంది. ఇది కాకుండా ఆపిల్ iPad, Mac లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా వచ్చాయి. ఈ కొత్త ఫీచర్లన్నీ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి.