California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడికి 200 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ 64 ఏళ్ల ప్రాథమిక పాఠశాల టీచర్ని ఒకప్పుడు ఆదర్శ ఉపాధ్యాయుడిగా భావించేవారు. కానీ తెరవెనుక ఆ వ్యక్తి చేసిన క్రూరత్వం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, పాఠశాల బాలికలపై క్రూరంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టలేదు.
READ MORE: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.. డిఫాల్ట్ బెయిల్‌కి ప్లాన్!
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఆ ఉపాధ్యాయుడి పేరు కిమ్ కెన్నెత్ విల్సన్. 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్లో పని చేశాడు. 23 ఏళ్లలో విల్సన్ చాలా మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడని దర్యాప్తులో తేలింది. అతను 6-7 ఏళ్ల బాలికలను కూడా వేధించాడు. విల్సన్ బాలికలతో అసహ్యకరమైన చర్యలకు పాల్పడటమే కాకుండా.. వీడియోలు సైతం రికార్డ్ చేశాడు. నిందితుడి నుంచి పోలీసులు వేలాది వీడియోలు, ఫొటోలు గుర్తించారు.
READ MORE: 50MP+50MP+32MP కెమెరాలు, 6,500mAh భారీ బ్యాటరీతో వచ్చేసిన Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్!
ఈ దారుణానికి పాల్పడటానికి ముందు విల్సన్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడేటప్పుడు శబ్దం బయటకు రాకుండా సౌండ్‌ప్రూఫ్ గదిని నిర్మించాడని విచారణలో వెల్లడైంది. పాఠశాలకు చెందిన బాలికలను ఆ గదికి రప్పించి, అక్కడ దారుణానికి ఒడిగట్టేవాడు. విల్సన్ తన ఇంట్లో పిల్లలతో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవాడని అధికారులు తెలిపారు. 2023లో పోలీసులు రహస్య సమాచారం ఆధారంగా అతని ఇంటిపై దాడి చేశారు. అప్పుడు విల్సన్ గురించి నిజం బయటపడింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. చాలా మంది పిల్లలు, వారి కుటుంబీకులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారు. విల్సన్‌పై 36 తీవ్రమైన అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ వ్యక్తి తన చివరి శ్వాస వరకు జైలులో ఉండాలని స్పష్టం చేశారు. 215 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!