Site icon NTV Telugu

California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Teacher

Teacher

అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడికి 200 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ 64 ఏళ్ల ప్రాథమిక పాఠశాల టీచర్‌ని ఒకప్పుడు ఆదర్శ ఉపాధ్యాయుడిగా భావించేవారు. కానీ తెరవెనుక ఆ వ్యక్తి చేసిన క్రూరత్వం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, పాఠశాల బాలికలపై క్రూరంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టలేదు.

READ MORE: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.. డిఫాల్ట్ బెయిల్కి ప్లాన్!

ఆ ఉపాధ్యాయుడి పేరు కిమ్ కెన్నెత్ విల్సన్. 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో పని చేశాడు. 23 ఏళ్లలో విల్సన్ చాలా మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడని దర్యాప్తులో తేలింది. అతను 6-7 ఏళ్ల బాలికలను కూడా వేధించాడు. విల్సన్ బాలికలతో అసహ్యకరమైన చర్యలకు పాల్పడటమే కాకుండా.. వీడియోలు సైతం రికార్డ్ చేశాడు. నిందితుడి నుంచి పోలీసులు వేలాది వీడియోలు, ఫొటోలు గుర్తించారు.

READ MORE: 50MP+50MP+32MP కెమెరాలు, 6,500mAh భారీ బ్యాటరీతో వచ్చేసిన Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్!

ఈ దారుణానికి పాల్పడటానికి ముందు విల్సన్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడేటప్పుడు శబ్దం బయటకు రాకుండా సౌండ్‌ప్రూఫ్ గదిని నిర్మించాడని విచారణలో వెల్లడైంది. పాఠశాలకు చెందిన బాలికలను ఆ గదికి రప్పించి, అక్కడ దారుణానికి ఒడిగట్టేవాడు. విల్సన్ తన ఇంట్లో పిల్లలతో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవాడని అధికారులు తెలిపారు. 2023లో పోలీసులు రహస్య సమాచారం ఆధారంగా అతని ఇంటిపై దాడి చేశారు. అప్పుడు విల్సన్ గురించి నిజం బయటపడింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. చాలా మంది పిల్లలు, వారి కుటుంబీకులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారు. విల్సన్‌పై 36 తీవ్రమైన అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ వ్యక్తి తన చివరి శ్వాస వరకు జైలులో ఉండాలని స్పష్టం చేశారు. 215 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Exit mobile version