Site icon NTV Telugu

BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..

Byd Atto 3 Evo

Byd Atto 3 Evo

చైనీస్ ఆటోమేకర్ BYD ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. తాజాగా BYD Atto 3 Evo కార్‌ను రివీల్ చేసింది. ఓల్డ్ వెర్షన్ BYD Atto 3 కారుతో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. తాజా వెర్షన్‌లో మెకానికల్, టెక్నాలజీ అప్‌డేట్స్ ఉన్నాయి. గతంలో 60.5 kWh బ్యాటరీ స్థానంలో ఇప్పుడు 74.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. డ్రైవింగ్ రేంజ్ 418 కి.మీ నుండి 510 కి.మీకి పెంచింది.

ప్రామాణిక రియర్ వీల్ డ్రైవ్ Evo వేరియంట్ 313 hp, 380 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే మరింత వేగాన్ని తక్కువ సమయంలో అందిస్తుంది. కేవలం 5.5 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 180 km/hగా ఉంది. మరింత ఫన్‌టూ డ్రైవ్ కోరుకునే వినియోగదారుల కోసం BYD ఆల్-వీల్-డ్రైవ్ Evo వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇదే బ్యాటరీతో ఈ వేరియంట్ 449 hp, 560 Nm శక్తిని అందిస్తుంది, ఇది కేవలం 3.9 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 200 km/h.

Read Also: Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..

ఇదే కాకుండా మేజర్ అప్డేట్ పరిశీలిస్తే 400V నుండి 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌కు మార్చారు. దీని వల్ల బ్యాటరీ ఛార్జింగ్ వేగం మరింత పెరుగుతుంది. 220 kWతో ఛార్జింగ్ చేయవచ్చు. కేవలం 10-80 శాతం బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. పాతది 88 kW ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేది. 3 kW వరకు ఎక్స్‌టర్నల్ డివైజ్‌లకు పవర్ అందించే విధంగా V2L (Vehicle-to-Load) సపోర్ట్ ఉంటుంది.

కార్ లోపల 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే స్టీరింగ్ వీల్ ముందు ఉంటుంది. 15.6-అంగుళాల రొటేటింగ్ టచ్ స్క్రీన్‌ను అందిస్తున్నారు. గేర్ సెలక్టర్ ఇప్పుడు స్టీరింగ్ కాలమ్‌లోకి మార్చబడింది. సెంటర్ కన్సోల్ ఖాళీగా ఉంటుంది. బూట్ కెపాసిటీ 490 లీటర్లకు పెరిగింది.

Exit mobile version