NTV Telugu Site icon

AP-Telangana: రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..

Ap Telangana

Ap Telangana

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ద్రోణి విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Read also: Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది

నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దాని ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..ఛాతిపై కొరుకుతూ

Show comments