NTV Telugu Site icon

Game Changer : భారీ రేటుకు కుదిరిన గేమ్ ఛేంజర్ ఓటీటీ డీల్ ?

Game Changer Ram Charan

Game Changer Ram Charan

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Read Also:Off The Record : బీఆర్‌ఎస్‌ అక్రమాలపై ఆ అధికారిని Congress రంగంలోకి దించుతుందా?

మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మ‌చ్చా మ‌చ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ట్రెండింగ్ లో ఉంది. డైరెక్ట‌ర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్‌లాంటి మాస్ హీరో ఉన్న‌ప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని మెగాభిమానులు, మూవీ ల‌వర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also:Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం..

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. గేమ్ ఛేంజర్ మూవీపై నెలకొన్న భారీ హైప్ కారణంగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ని ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.