NTV Telugu Site icon

Devara 3rd SOng : ‘దేవర’ మూడో పాట.. అడగకండి.. ఎప్పుడొచ్చినా భీభత్సమే!

New Project 2024 08 28t093750.150

New Project 2024 08 28t093750.150

Devara 3rd SOng : జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై తారక్ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.

Read Also:Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..

అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నారు చిత్రమేకర్స్. ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నేటి నుండి వచ్చే నెల 27కు దేవర రిలీజ్ కు ఇంక నెల రోజులు మాత్రమే ఉందని ఒక నెలలో, అతని రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది, సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మెజెస్టిక్ మ్యాడ్‌నెస్‌ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరలోని తారక్ రెండు షేడ్స్ చూపిస్తూ అధికారక పోస్టర్ రిలీజ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాను దర్శకుడు కొరటాల పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read Also:DY Chandrachud: నేను సీజేఐ చంద్రచూడ్‌ని, రూ. 500 పంపండి.. ప్రధాన న్యాయమూర్తి పేరుతో మెసేజ్లు..!

ఈ క్రమంలోనే ఈ మూవీలోని మూడో సాంగ్‌కి సంబంధించి ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. దేవర సినిమాలోని మూడో పాట ‘చుట్టమల్లె’ సాంగ్‌ని మించి ఉంటుందని.. ఇందులో పాటతో పాటు ఆట కూడా ఉంటుందన్నారు. అంతేగాక, ఈ పాటలో తారక్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని.. ఈ పాట ఎప్పుడొచ్చినా భీభత్సమే అని అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ‘దేవర’ మూవీలోని మూడో పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Show comments