Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Second Hand Car Buying: తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ (పాత) కార్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి. బడ్జెట్‌కు తగినట్లు లభించే పాత కారు మంచి కండిషన్లో ఉంటే అది మంచి ఎంపికే అవుతుంది. అయితే బయటకు మెరిసిపోతూ కనిపించే రూపాన్ని మాత్రమే చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. సరైన తనిఖీ లేకుండా కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు కారు పరిస్థితి, ఇంజిన్, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. కాబట్టి కారు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసేద్దామా..
ఇంజిన్ కండిషన్
పాత కారు కొనుగోలులో ఇంజిన్, ఇతర విడిభాగాల పరిశీలన చాలా ముఖ్యం. మీకు ఆటోమొబైల్స్‌పై తగినంత అవగాహన లేకపోతే, నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. అతడు ఇంజిన్, క్లచ్, గేర్‌బాక్స్, బ్రేకులు, సస్పెన్షన్, బ్యాటరీ స్థితిని సరిగ్గా అంచనా వేయగలడు. ముఖ్యంగా టెస్ట్ డ్రైవ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. కనీసం 10 కిలోమీటర్ల మేర కారును నడిపి.. స్టీరింగ్ పనితీరు, గేర్లు మారే తీరు, బ్రేకింగ్ సామర్థ్యాన్ని గమనించాలి. డ్రైవింగ్ సమయంలో ఏవైనా శబ్దాలు, కుదుపులు లేదా బ్రేక్ వేసేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే వాటి కారణాన్ని తెలుసుకోవాలి.
Also Read
- Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
- Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
డాక్యుమెంట్ల పరిశీలన
కారు కొనే ముందు అన్ని లీగల్ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఆర్సీ (RC), ఇన్సూరెన్స్, పీయూసీ (PUC) సర్టిఫికెట్, సర్వీస్ హిస్టరీని పరిశీలించాలి. ఒకవేళ ఆ కారుపై గతంలో లోన్ తీసుకుని ఉంటే, దానికి సంబంధించిన ఫైనాన్స్ లావాదేవీలు పూర్తయ్యాయా.? లేదా.? NOC వచ్చిందా.? అనేది చూసుకోవాలి. ఆర్సీ బుక్‌లో నమోదైన ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్లను కారులోని నంబర్లతో సరిపోల్చడం మర్చిపోకూడదు. సర్వీస్ రికార్డులను చూడటం ద్వారా కారుకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ జరిగిందా.? గతంలో ఏవైనా పెద్ద రిపేర్లు చేయించారా అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ఆ వాహనంపై పెండింగ్ కేసులు, చలానాలు ఉన్నాయో లేదు కచ్చితంగా చెక్ చేసుకోవాలి.
బడ్జెట్
ముందుగా మీ అవసరాలు, పూర్తి బడ్జెట్‌పై స్పష్టత తెచ్చుకోవాలి. కేవలం కారు అమ్మకపు ధరను మాత్రమే బడ్జెట్‌గా భావించవద్దు. ఇన్సూరెన్స్, సర్వీసింగ్, ఆర్సీ (RC) బదిలీ, పన్నులు, రాబోయే మెయింటెనెన్స్ ఖర్చులను కూడా ఇందులో కలపాలి. ఆ తర్వాత మీ వినియోగానికి సరిపోయేలా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఎంచుకోవాలి. కారు నచ్చినట్లయితే బాడీపై ఎక్కడైనా డెంట్లు, తుప్పు, రీ-పెయింటింగ్ లేదా యాక్సిడెంట్ గుర్తులు ఉన్నాయేమో పరిశీలించాలి. డోర్లు, బానెట్, డిక్కీ సరిగ్గా తెరుచుకుంటున్నాయో లేదో చూడాలి. అలాగే కారు లోపలి సీట్ల పరిస్థితి, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోలు, హెడ్లైట్లు, ఇండికేటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో స్వయంగా ఆపరేట్ చేసి చూసుకోవాలి.
మార్కెట్ ధర పోలిక
కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో తెలుసుకోవడానికి ఓడోమీటర్ రీడింగ్‌ను సర్వీస్ రికార్డులతో సరిపోల్చుకోవాలి. కేవలం మీటర్లో కనిపించే సంఖ్యను మాత్రమే గుడ్డిగా నమ్మకూడదు. కారు గతంలో ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైందా అనే వివరాలు ఆరా తీయాలి. మార్కెట్ ధర కంటే కారు చాలా తక్కువ రేటుకే వస్తోందని అనిపిస్తే తొందరపడి కొనుగోలు చేయకూడదు. వివిధ సెకండ్ హ్యాండ్ ప్లాట్‌ఫామ్‌లలో అదే మోడల్, అదే సంవత్సరం తయారైన ఇతర కార్ల సగటు ధరలను సరిపోల్చి చూసుకున్న తర్వాతే సరైన ధరకు కొనుగోలు చేయాలి.
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!