NTV Telugu Site icon

Estate Dekho: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. ‘ఎస్టేట్ దేఖో’తో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి..

Estate Dekho

Estate Dekho

Estate Dekho: చాలా మంది తమ పేరుతో ఒక సొంత ఇల్లు ఉండాలని, ఓ ఇంటి స్థలం కొనుక్కోవాలని, మంచి ఏరియాలో ప్లాట్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం, లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు చేస్తుంటారు. ఇతర ఆర్థిక అవసరాలను తగ్గించుకుని కూడా ఇంటి కోసం ఆదా చేస్తుంటారు. ఇల్లు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కష్టపడి పోగేసిన ప్రతి రూపాయిని వెచ్చించి కొనే ఆస్తి ఇది. అందువల్ల మీరు కొనే ఇంటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రాపర్టీని కొనడం కోసం ఎన్నో ప్రాంతాల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ, వారిని వీరిని సంప్రదిస్తూ ఉంటారు. బ్రోకర్లను సంప్రదిస్తూ ఉంటారు. కానీ మనకు ఎన్నో అనుమానాలు మనస్సులో మెదులుతూ ఉంటాయి. కొనుగోలుదారులకు ఆ శ్రమను తప్పిస్తోంది ‘ఎస్టేట్ ధేఖో’. ఇక్కడ చాలా మంది వెరిఫైడ్ బిల్డర్స్ ఉంటారు కాబట్టి త్వరగా మనం కోరుకునే ప్రాపర్టీ మనకు దక్కుతుంది.

‘ఎస్టేట్ దేఖో’ ప్రాపర్టీస్ చెక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు వారు ఇష్టపడే ప్రాంతంలో, బడ్జెట్, సౌకర్యాలు, అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి రియల్ ఎస్టేట్ సూచనలను అందిస్తుంది. ‘ఎస్టేట్ దేఖో’ కొనుగోలుదారులను, విక్రేతలను కలిపే అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తుంది. ఎక్కువ మంది ప్రాపర్టీ అన్వేషకులను నిలుపుకోవడానికి వారికి ప్రాపర్టీ వివరాలను ఖచ్చిత ధరలతో అందిస్తారు. ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను మార్కెట్‌లోని వివిధ ధరల శ్రేణి గృహాలను పోల్చడానికి అనుమతిస్తుంది. పాత ఆస్తి ప్రకటనలు, సంబంధిత ఆస్తుల ఫోటోలు లేదా విస్తీర్ణం, ఫ్లోర్ ప్లాన్‌లతో విక్రయించిన ధరలను సరిపోల్చడానికి సిస్టమ్ వినియోగదారులకు సహాయపడుతుంది. ఎస్టేట్ దేఖో క్లయింట్‌లు తమకు సరైన ప్రాపర్టీని ఎంచుకోవడానికి హెచ్‌ఎండీఏ లేదా హుడా ప్లాట్‌లతో సహా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు వాణిజ్య, నివాస ఆస్తులకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం ‘ఎస్టేట్‌ ధేఖో’ హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో వినియోగదారులకు తమ సేవలను అందిస్తోంది. త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ‘ఎస్టేట్ దేఖో’ సహ వ్యవస్థాపకులు రంజిత్ రెడ్డి వాసిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను వీక్షించండి.