Chennai : తమిళనాడుతో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని స్నేహితుడి ఇద్దరు కొడుకులను మరో స్నేహితుడు చంపాడు. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా అంబూరులో చోటు చేసుకుంది. వసంత్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడు యోగరాజ్ కు 14 వేల అప్పు ఇచ్చాడు. కొన్ని కారణాల చేత స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు చెల్లింపుపై ఇరువురు మధ్య గత కోన్నిరోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పు చెల్లించడానికి మరికొద్ది రోజులు సమయం కోరడంతో ఆగ్రహంతో స్నేహితుడు యోగరాజ్ ఇద్దరు కుమారులైన యోగిత్ (6), దర్శన్ (4)లకు స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్ళి కొట్టి చంపాడు వసంత కుమార్. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యా్ప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో 14,000 అప్పు చెల్లించకపోవడంతో యోగరాజ్ పిల్లల్ని కొట్టి చంపినట్లు వసంత్ కుమార్ ఒప్పుకున్నారు.
Chennai : చెన్నైలో దారుణం అప్పు తీర్చలేదని స్నేహితుడి కొడుకులను చంపిన కసాయి
Show comments