Site icon NTV Telugu

Road Accident: గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి

Road Accident Pak

Road Accident Pak

గుజరాత్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో రెండు బస్సులు భారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మల్పూర్ నుండి వస్తున్న గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటి మోదసా నుండి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. కాగా.. ప్రమాద ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సిసిటివిలో రికార్డ్ అయింది.

Read Also: CM Revanth Reddy: రాష్ట్ర దశాబ్ది వేడుకలు.. గవర్నర్ కు సీఎం రేవంత్ ఆహ్యానం

ఈ ఘటన సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే పలువురు బాటసారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దీంతో పాటు ప్రమాదంపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read Also: Gangs Of Godavari : ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేసిన విశ్వక్ సేన్ మూవీ..

Exit mobile version