Bus Fire: ప్రజా రవాణా భద్రతపై ఆందోళన.. ఒకేరోజు రెండు బస్సుల్లో అగ్నిప్రమాదాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire: ఆదివారం నాడు వేర్వేరు సమయాల్లో రెండు PMPML బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. ఇందులో మొదటి ప్రమాదం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో జరిగింది. పింప్ల్రీ నుంచి భోసరికి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న PMPML బస్సు లోకండే కామ్‌గార్ భవన్ సమీపంలో ఇంజిన్ నుంచి పొగ రావడం మొదలైంది. పరిస్థితిని బస్సు డ్రైవర్ వెంటనే గమనించి బస్సు తలుపులు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ తక్షణమే స్పందించడం వల్ల మంటలు పూర్తిగా వ్యాపించేలోపే ప్రయాణికులందరూ సురక్షితంగా బస్సు నుంచి బయటపడ్డారు.
Winter Health Tips for Kids: చలి పెరుగుతోంది.. మీ పిల్లలు జాగ్రత్త సుమా..!
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇక రెండో ప్రమాదం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాలేవాడి ఫాటా సమీపంలో జరిగింది. పూణే నుంచి డాంగే చౌక్ వైపు వెళ్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ కంపార్ట్‌మెంట్ నుంచే మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఈ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?
ఈ రెండు సందర్భాల్లోనూ పింప్ల్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ రెండు బస్సులకు భారీ నష్టం జరిగింది. ఒకే రోజు వరుసగా జరిగిన ఈ ఘటనలు ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల్లో ఆందోళన కలిగించాయి. PMPML బస్సులను సక్రమంగా నిర్వహిస్తున్నారా..? తనిఖీ చేస్తున్నారా లేదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల గురించి PMPML ఇంకా అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!