Site icon NTV Telugu

Bus Fire: ప్రజా రవాణా భద్రతపై ఆందోళన.. ఒకేరోజు రెండు బస్సుల్లో అగ్నిప్రమాదాలు..!

Bus Fire

Bus Fire

Bus Fire: ఆదివారం నాడు వేర్వేరు సమయాల్లో రెండు PMPML బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. ఇందులో మొదటి ప్రమాదం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో జరిగింది. పింప్ల్రీ నుంచి భోసరికి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న PMPML బస్సు లోకండే కామ్‌గార్ భవన్ సమీపంలో ఇంజిన్ నుంచి పొగ రావడం మొదలైంది. పరిస్థితిని బస్సు డ్రైవర్ వెంటనే గమనించి బస్సు తలుపులు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ తక్షణమే స్పందించడం వల్ల మంటలు పూర్తిగా వ్యాపించేలోపే ప్రయాణికులందరూ సురక్షితంగా బస్సు నుంచి బయటపడ్డారు.

Winter Health Tips for Kids: చలి పెరుగుతోంది.. మీ పిల్లలు జాగ్రత్త సుమా..!

ఇక రెండో ప్రమాదం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాలేవాడి ఫాటా సమీపంలో జరిగింది. పూణే నుంచి డాంగే చౌక్ వైపు వెళ్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ కంపార్ట్‌మెంట్ నుంచే మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఈ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?

ఈ రెండు సందర్భాల్లోనూ పింప్ల్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ రెండు బస్సులకు భారీ నష్టం జరిగింది. ఒకే రోజు వరుసగా జరిగిన ఈ ఘటనలు ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల్లో ఆందోళన కలిగించాయి. PMPML బస్సులను సక్రమంగా నిర్వహిస్తున్నారా..? తనిఖీ చేస్తున్నారా లేదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల గురించి PMPML ఇంకా అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

Exit mobile version