Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు. భక్తులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కొండపై నుంచి కిందపడితే పెనుప్రమాదం సంభవించి ఉండేది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దేవుడి దయ వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డామని బస్సులోని భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. భక్తులను మరొక వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో బస్సు అడ్డంగా ఉండడంతో తిరుమల రెండో ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Also: