మొబైల్ టిఫిన్ సెంటర్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన జనగాం జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రఘునాథ్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డు పక్కనే ఓ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరొకరు మృతి చెందినట్లు సమాచారం. వీరేకాకుండా.. టిఫిన్ సెంటర్‌లో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి టిఫిన్ సెంటర్‌లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో.. భయంకర దృశ్యాలు ప్రమాదం జరిగిన తీరుకు కనబరుస్తున్నాయి. కాగా, ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Bus Accident : మొబైల్ టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..

Bus Accident