భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం ఆనందఖని వద్ద ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో 40 మంది ప్రయాణికులు గాయపడగా వారిలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారు. రుద్రంపూర్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి మెయిన్ రోడ్డుపైకి వస్తున్న బొగ్గు టిప్పర్ బస్సును పక్కకు ఢీకొట్టడంతో అదుపుతప్పి ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు, అద్దాలు, ఇతర భాగాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని లేదు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు మరియు రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు.
Also Read : CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సీఎస్కే.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
యాక్సిడెంట్ కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు బొగ్గు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేయడంతో పాటు లారీని సీజన్ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందని.. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పడ్డట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు. ఒకరు ఇద్దరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కొత్తగూడెం ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద క్షతగాత్రులు మరియు వారి బంధువులతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read : Heavy Rains In Telugu States Live:తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీవర్షాలు