Site icon NTV Telugu

Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడిన 70మంది ప్రయాణికులతో కూడిన బస్సు..

Accident

Accident

గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. లగ్జరీ బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. ప్రమాదంపై సమాచారం అందుకున్న సపుతర పోలీసులు, 108 బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించారు.

READ MORE: Bharateeyudu 2: గ్రాండ్‌గా ‘భారతీయుడు-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన సేనాపతి, తారాగణం

బస్సు ఆదివారం ఉదయం సూరత్ చౌక్ మార్కెట్ నుంచి సపుతరకు పర్యాటకులతో బయలుదేరి.. తిరిగి సూరత్ వైపు వెళ్తోంది. మార్గమధ్యలో ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా ముందు నుంచి వస్తున్న టెంపోను తప్పించే క్రమంలో అదుపు తప్పింది. అక్కడే ఉన్న రక్షణ గోడను ఢీకొని లోయలో పడింది. ప్రస్తుతం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించే పనులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన సపుతర-మలేగాం జాతీయ రహదారి ఘాట్ వద్ద సపుతరకు 2 కి.మీ దూరంలో జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version