NTV Telugu Site icon

Burning of Revenue Records : రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటన.. విచారణ ముమ్మరం

Burn Records

Burn Records

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి నాలుగో రోజునా విచారణ ముమ్మరంగా సాగింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తాసిల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైకాపా బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెలగక్కారు. దీంతోపాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు…

Kanwar Yatra: యాత్ర శాంతియుతంగా కొనసాగాలనే ఆ ఉత్తర్వులు..

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి ఇటు రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు సమాంతరంగా నాలుగో రోజు కూడా విచారణ వేగవంతంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీసోడియ ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్టర్లు రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీవోలు తాసిల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనేదానిపై సిసోడియా ఆరా తీశారు. గడచిన మూడేళ్ల కాలంలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలు పై చర్చించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూముల పైన సిసోడియా సంబంధిత రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ ఏ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏవిధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

Raj Tarun Tag: రాజ్‌ తరుణ్‌కి ‘ట్యాగ్’.. ఏంటో తెలుసా?

మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీసీ సోడియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయనకు అర్జీలు ఇవ్వడానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బాధితులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎక్కువగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు వైకాపా బాధితులందరూ కార్యాలయానికి చేరుకుని ఆర్పి సిసోడియాకు ఫిర్యాదులు అందజేశారు. గడిచిన మూడేళ్లుగా వైకాపా నాయకులు తమ భూములను బలవంతంగా లాగేసుకున్నారని ఇదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు….

రెవెన్యూ అధికారుల సమీక్ష ఓవైపు జరుగుతుండగానే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ మరోవైపు జిల్లా పోలీస్ అధికారులతో కేసు పురోగతికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తో పాటు డిఎస్పీలు సిఐలతో కేసు వివరాలపై ఆరా తీశారు. అగ్నిమాపక శాఖ అధికారులు క్లూస్ టీం సిబ్బందితో కూడా సమావేశమై ఎంతవరకు పురోగతి వచ్చిందని దానిపై ఆరా తీశారు. ఇప్పటికే 35 మంది అనుమానితులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీవోలు మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ వీఆర్ఏ రమణయ్యలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న వైకాపా నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.