పాకిస్థాన్ లోని పలు చర్చిలు, డజన్ల కొద్దీ ఇళ్లను తగలబెట్టడాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. మానవ, నైతిక విలువలు, సూత్రాలకు విరుద్ధంగా భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని పద్ధతులను యూఏఈ శాశ్వతంగా తిరస్కరించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగం, తీవ్రవాదం ప్రజల మధ్య సహనం, సహజీవనం, శాంతి విలువలను వ్యాప్తి చేయడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు విరుద్ధంగా ఉన్నాయని నొక్కి చెప్పింది.
Read Also: Sudigali Sudheer: ఒక విరాట్.. ఒక రాజమౌళి.. ఒక సుడిగాలి సుధీర్.. అదిరిన ‘గోట్’ గ్లింప్స్
కాగా.. పవిత్ర ఖురాన్ ను అపవిత్రం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పారిశ్రామిక నగరమైన ఫైసలాబాద్ శివార్లలోని క్రైస్తవులు అధికంగా నివసించే ఏరియాలో ఓ గుంపు ప్రవేశించింది. చర్చి విధ్వంసం కేసులో 100 మందికి పైగా అరెస్టు చేసిశారని పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తమపై దాడి జరుగుతుంటే.. పోలీసులు మౌనంగా చూస్తూ.. ఉండిపోయారని క్రైస్తవ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి 100 మందిని అరెస్టు చేసిన మరుసటి రోజే ఫైసలాబాద్ జిల్లా జరన్ వాలా పోలీసులు రెండు ఉగ్రవాద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Read Also: Health Tips : వీటిని రోజూ రాత్రి తింటే చాలు.. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళతారు..
అయితే, జమాత్ అహ్ల్-ఇ-సున్నత్ తో సంబంధం ఉన్న ఎనిమిది మందిని గుర్తించాం, వారిలో ఒకరు తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం 1997లోని ‘ఉగ్రవాద చర్యలకు శిక్ష’ అనే సెక్షన్లను ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల గురించి తెలుసుకున్న పోలీసు బృందం అక్కడికి చేరుకుని బాష్పవాయువు ప్రయోగించిందని తెలిపారు.