Site icon NTV Telugu

CSIR Recruitment 2023: CSIRలో రిక్రూట్‌మెంట్.. జీతం ఎంతో తెలుస్తే షాకవుతారు..!

Jobs

Jobs

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. CSIR-ICIB లో 400 కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఈ జాబ్ లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csir.res.in నుండి ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం 12 జనవరి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.

UP Murder Case: లాయరైన నిందితుడు.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..

ఖాళీల వివరాలు
CSIR-ICIB లో మొత్తం 444 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 368, సెక్షన్‌ ఆఫీసర్‌ 76 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, వయో పరిమితి
గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దానితో పాటు అభ్యర్థి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి.

జీతం
సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు జీతం – రూ. 47,600 నుండి రూ. 1,51,100
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీతం – రూ. 44,900 నుండి రూ. 1,42,400

ఎంపిక ప్రక్రియ
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఫేజ్ 1 పరీక్ష బహుశా ఫిబ్రవరి 2024లో నిర్వహించబడుతుంది.

దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీ, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. SC, ST, PWD, Ex-Serviceman, CSIR డిపార్ట్‌మెంట్ అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్‌సైట్ www.csir.res.inకి వెళ్లండి.
హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌కు వెళ్లండి.
కొత్త పేజీ కనిపిస్తుంది.
అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
మరొక పేజీ వస్తుంది
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఫారమ్‌ను సమర్పించి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

Exit mobile version