Site icon NTV Telugu

MLA Raja Singh :ఎట్టకేలకు రాజా సింగ్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం

Rajasingh

Rajasingh

గత కొన్ని రోజులుగా తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు పాడైందని, దాన్ని మార్చాలంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నపాటి ఉద్యమమే చేశారని చెప్పాలి. అయితే.. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం నిలిచిపోవడంతో ఇటీవల డీజీపీకి తనకు వెహికిల్‌ చేంజ్‌ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్పిడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్థానంలో మరో వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది.

Also Read : Business Headlines 28-02-23: విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ. మరిన్ని వార్తలు

అయితే.. ఈ మధ్యే తన పాత బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం అసెంబ్లీ సమావేశాల్లో టైం మరోసారి ప్రగతిభవన్‌ వద్ద నిలిచిపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం.. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన తన బుల్లెట్ బైక్ మీద వచ్చారు. అయితే ఇదిలా ఉంటే.. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్ నుంచి రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్, మెస్సేజ్‌లు రావటం.. ఈ బెదిరింపులపై డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది.

Also Read : TSLPRB : మహిళ అభ్యర్థుల అలర్ట్‌.. నేడే లాస్ట్‌ డేట్‌

ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం రోజున ఇంకో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించారు. అయితే.. ఇప్పుడు కేటాయించిన వాహనం కూడా కొత్తది కాకుండా.. 2017 మోడల్‌ కారు ఇవ్వటం గమనార్హం.

Exit mobile version