NTV Telugu Site icon

Gold Royal Enfield: బంగారంతో బుల్లెట్ బైక్.. స్పెషల్ అట్రాక్షన్ గా శివాజీ స్టాచ్యు

Gold Bullet Bike

Gold Bullet Bike

సాధారణంగా బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా భారతీయులకైతే బంగారం అంటే విపరీతమైన ఇష్టాన్ని పదర్శిస్తారు. బంగారు నగలపైన వారికుండే మక్కువ అంతా ఇంతా కాదు.. అయితే ఈ బంగారంపై మక్కువ ఒక్క స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే గోల్డ్‌ అంటే వారికి పిచ్చి అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సంబంధించిన ప్రతిదీ గోల్డ్‌ కలర్‌లో కనిపించాల్సిందే అని అనుకుంటారు.

Read Also: Samajavaragamana : రెట్టింపు లాభాలతో దూసుకుపోతున్న సామజవరగమన..

అయితే.. అందుకు తగ్గట్టుగానే బంగారం కూడా చాలా ఖరీదైనది. ఇటీవల బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి బంగారం అంటే ఎంత మక్కువ ఉన్నా అందరూ కొనుక్కోలేరు కదా.. అందుకే బంగారంపై ఉన్న మక్కువను ఇలా తీర్చుకుంటుంటారు. ఓ వ్యక్తి తన బుల్లెట్‌ బైక్‌ మొత్తాన్ని బంగారం రంగులోకి మార్చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Read Also: Rajendranagar Crime: మార్నింగ్ వాక్‌ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు.. తల్లి, కూతురు మృతి

భారత్ లో బైక్స్ లో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు.. దశాబ్దాల చరిత్ర ఈ బైక్స్ కు సొంతం. ముఖ్యంగా బైక్స్ అంటే మోజుపడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఓ స్టేటస్ సింబల్ గా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ పై రయ్యి రయ్యిన రోడ్డుమీద దూసుకు పోవాలని కోరుకుంటారు. అంతేకాదు తమ బైక్ పై ఉన్న ఇష్టాన్ని తెలియజేసేందుకు నచ్చిన రీతిలో దాన్ని మార్పులు చేసి.. సంతోషపడుతుంటారు.

Read Also: Prabhas : ప్రభాస్ కూడా జాతకాలను నమ్మతున్నాడా?

అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికీ బంగారం అంటే ఇష్టం.. అదే స్థాయిలో బైక్స్ అన్నా ఇష్టం.. తన ఇష్టాలను మొత్తం కలగలిపి సరికొత్తగా బైక్ ను డిజైన్ చేయించుకుని అందరినీ ఆకర్షించాడు. పూణేలోని పింప్రీ-చించ్వాడ్ కి చెందిన సన్నీ వాఘురే అనే వ్యక్తి తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ను గోల్డెన్‌ బుల్లెట్‌గా మార్చేసుకున్నాడు. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్, ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ కలర్ లోకి మార్చుకున్నాడు. అలాగే బుల్లెట్ బండి ముందు భాగంలో శివాజీ బొమ్మ గోల్డెన్ కలర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.