NTV Telugu Site icon

Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో

Ox Building

Ox Building

Viral Video, Ox climbed on Building Due to Rain in Palakollu: భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓ వైపు వరదలు, మరోవైపు వర్షపు చినుకులతో జనాలు అల్లాడిపోతున్నారు. కొందరు అయితే చలితో వణికిపోతున్నారు కూడా. ఇందుకు జంతువులు కూడా అతీతమేమీ కాదు. వర్షాలకు తట్టుకోలేక సరైన చోటు కోసం వెతుకుతుంటాయి. తాజాగా ఓ ఆంబోతు కూడా ఇదే పని చేసింది. వర్షాలకు తట్టుకోలేక బిల్డింగ్‌ కారిడార్‌లోకి వెళ్లింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఓపెన్ ఏర్ థియేటర్ రోడ్డులోని ఓ బిల్డింగ్‌పైకి ఆంబోతు ఎక్కింది. మంగళవారం కురిసిన వర్షానికి రాత్రి సమయంలో మెట్ల ద్వారా బిల్డింగ్‌పైకి ఆంబోతు ఎక్కింది. అధికారి కంప్యూటర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బిల్డింగ్‌ కారిడార్‌లో హాయిగా సేదతీరుతోంది. ఉదయం ఈ ఘటన చూసిన జనాలు ఆంబోతును చూసి తెగ నవ్వుకుంటున్నారు.

Also Read: TS Crime News: వీడియోస్ చేస్తుందని.. చెల్లిపై రోకలిబండతో దాడి చేసిన అన్న! చివరకు..

ఆంబోతు బెదిరితే రోడ్డుపైకి దూకేస్తుందేమో అని ఓపెన్ ఏర్ థియేటర్ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక ఆంబోతు కారిడార్‌లోకి ఉండడంతో ఆ బిల్డింగ్ డోర్స్ అన్ని క్లోజ్ అయ్యే ఉన్నాయి. అక్కడికి వచ్చిన జనాలు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ‘వర్షాలకు తట్టుకోలేక బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు’, ‘ఈ ఆంబోతు చాలా తెలివైనది గురూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Air India Pilot: నా డ్యూటీ అయిపోయింది.. విమానం నడపనని వెళ్లిపోయిన పైలెట్! ముగ్గురు బీజేపీ ఎంపీల పడిగాపులు