NTV Telugu Site icon

Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి

New Project (22)

New Project (22)

Building Collapse : ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 16 మంది భవన శిథిలాలలో చనిపోయారు. 4 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చాలా మంది శిథిలాలలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Good News For Teachers : తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్.. 2.73శాతం డీఏ పెంపు

నీటి లీకేజీ కారణంగా పునాది బలహీనంగా ఉండడంతో భవనం కూలిపోయిందని దర్యాప్తులో తేలింది. ఈ కోణంలో విచారణ సాగుతోంది. అలెప్పో నగరం అమెరికా మద్దతుగల కుర్దిష్ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ 5 అంతస్తుల భవనంలో 30 మంది నివసిస్తున్నారు. నిన్న హఠాత్తుగా ఈ భవనం పేకమేడలా కూలిపోయింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇక్కడ చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ భవనం కూలి 16 మంది దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. అలెప్పో నగరం ఒకప్పుడు సిరియా వాణిజ్య నగరం కావడం గమనార్హం.

Read Also: Gun Fire : చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు