NTV Telugu Site icon

Telangana: ఘనంగా బుగ్గ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పోటెత్తిన భక్తజనం

Nagarkurnool

Nagarkurnool

Telangana: నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు బుగ్గ పెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ వీధులన్నీ గోవిందా నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం నుంచి వారం రోజుల పాటు జాతరను నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి ఛైర్మన్ జగదీశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలను పొందాలన్నారు.

BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

ఉత్సవాల్లో భాగంగా శనివారం నిత్యారాధన, అభిషేకం, ప్రబంధ పారాయణం, హోమబలిహరణం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, తీర్థ ప్రసాదాలు అందించడం వంటి క్రతువులు నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా, భక్తుల హరినామస్మరణల మధ్య పల్లకిసేవ, రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మలు, మిఠాయి దుకాణాల వద్ద భక్తులు సందడి చేశారు.

Show comments