Budi Mutyala Naidu vs Budi Ravi: రచ్చకెక్కిన తండ్రీకొడుకులు.. డిప్యూటీ సీఎం సొంతూరు తారువలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budi Mutyala Naidu: అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది. కూటమి తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు బూడి రవి మద్దతిస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. సీఎం రమేష్‌తో కలిసి బూడి రవి తారువ గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ముత్యాల నాయుడు ఇంటికి 100 మీటర్ల దూరంలో వారిని పోలీసులు ఆపేశారు. అయితే ఆ ఇంటికి వెళ్లిన బూడి రవి ఇల్లు తన తాతదని వాదించారు. ఇల్లు తన పేరు మీద ఉందని లీగల్‌గా తేల్చుకోవాలని బూడి ముత్యాల నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చెలరేగింది.
Read Also: Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇదిలా ఉండగా.. సీఎం రమేష్ వాహనాన్ని బూడి ముత్యాల నాయుడు అనుచరులు ముట్టడించారు. కారుపై దాడికి యత్నించారు. వందల మంది చేరుకోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. సీఎం రమేష్ వాహనాల్లోన ఒకటైన జీపును ధ్వంసం చేశారు. రౌడీ రాజకీయాలు మా గ్రామాలలో వద్దు అంటు నినాదాలు చేశారు. అనంతరం బూడి అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. సీఎం రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గ్రామంలోని కూటమి నేతలు అడ్డుకున్నారు. రాజకీయ కారణాలతో కుటుంబంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు కారణం అయింది.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!