Budget 2024 : బడ్జెట్లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ప్రకటించిన నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024 : లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు. భారతదేశం ఇలాగే ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించాము. దీని వల్ల 80 కోట్ల మందికి పైగా పేదలు లబ్ధి పొందుతున్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఐదు పథకాల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. దీనివల్ల ఐదేళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్లో హామీ ఇచ్చాం’ అని అన్నారు.
Read Also:Mukhesh Ambani : బడ్జెట్‌కు 35 నిమిషాల ముందు రూ.19వేల కోట్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బడ్జెట్లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
1. వ్యవసాయంలో ఉత్పాదకత
2. ఉపాధి, సామర్థ్యం అభివృద్ధి
3. సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
4. తయారీ, సేవలు
5. పట్టణాభివృద్ధి
6. శక్తి భద్రత
7. మౌలిక సదుపాయాలు
8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
9. తదుపరి తరం మెరుగుదలలు(Next generation reforms)
Read Also:IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..