Site icon NTV Telugu

Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్‌ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు

Nirmala

Nirmala

Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ నిర్మాణంలో రీక్యాంప్ ఉంటుందని అంచనాలు. ఇది GST మోడల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్‌ జియోపాలిటికల్‌ అస్థిరతల నేపథ్యంలో.. ఆర్థిక వేగాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఇక, ప్రభుత్వ అధికారులు తెలిపిన ప్రకారం.. ఈ బడ్జెట్‌లో డెట్‌-టు-జీడీపీ నిష్పత్తిని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. దీంతో కేవలం లోటు శాతం నియంత్రణ, మొత్తం రుణ భారం తగ్గించే ధోరణికి దారి తీస్తుంది.

Read Also: Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ

వ్యక్తిగత పన్ను దాతలకు ఎక్కువ స్టాండర్డ్ డిడక్షన్‌
గత సంవత్సరం ఆదాయపన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంచడంతో పన్ను సౌకర్యం అందించగా, ఈసారి ట్యాక్స్ పేయర్స్ మరోసారి స్టాండర్డ్ డిడక్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. 1 ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి రానున్న సింప్లిఫైడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారం స్పష్టమైన నిబంధనలు ప్రవేశ పెట్టవచ్చని అంచనా. కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా మారేలా.. కొత్త వ్యవస్థను ఎంచుకునేలా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది.

TDS సరళీకరణ అండ్ కస్టమ్స్‌ రేట్లు:
రేట్లను తగ్గించి, సరళీకరించవచ్చని ప్రభుత్వం TDS (Tax Deducted at Source) వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, కస్టమ్స్‌ రేట్లు తగ్గింపు, ట్రేడ్ ఫెసిలిటేషన్‌ కోసం సులభమైన విధానాలు ప్రవేశ పెట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే, వివాదాలు- లిటిగేషన్లలో రూ.1.53 లక్షల కోట్ల “డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్” ప్రవేశ పెట్టవచ్చని సమాచారం.

Read Also: Budget 2026: గ్లోబల్‌ అనిశ్చితుల్లో భారత్‌ బడ్జెట్‌పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు

రక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాలు:
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న భద్రతాపరమైన భయాల నేపథ్యంలో రక్షణ బడ్జెట్ కి ప్రత్యేక కేటాయింపులు ఉండవచ్చని అంచనా. అలాగే, గ్రామీణ భారతదేశం కోసం “వికసిత్ భారత్- ఎంఎండ్లాయ్‌మెంట్ అండ్ లైవ్‌లిహుడ్ మిషన్” క్రింద కొత్త పథకం కేంద్ర- రాష్ట్రాలు సంయుక్తంగా ప్రవేశ పెట్టవచ్చని భావిస్తున్నారు.

వివిధ రంగాలకు బడ్జెట్ సాయం
* కేంద్ర ఉద్యోగులు: 8వ పే కమిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధపడే అవకాశం ఉంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమలు కావొచ్చని అంచనా.
* రాష్ట్రాలు: 16వ ఫైనాన్స్‌ కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల కేటాయింపు పెరుగుతుందేమో అని ఊహిస్తున్నారు.
* MSMEలు, గెమ్స్ & జ్యువెలరీ, లెదర్ & ఫుట్‌వేర్: ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు లభించవచ్చని అంచనా.
* క్రిటికల్ మినరల్స్ (లిథియం, కోబాల్ట్): అన్వేషణ, ప్రాసెసింగ్‌ కోసం అదనపు నిధులు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇది భారతదేశ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను సౌకర్యాలు, TDS సరళీకరణ, కస్టమ్స్‌ పునర్వ్యవస్థ, రక్షణ, గ్రామీణాభివృద్ధి, MSME, వ్యూహాత్మక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అంచనా. ఈ బడ్జెట్‌ భారత్‌ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసే కీలక బడ్జెట్‌గా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version