Site icon NTV Telugu

Budget 2024 LIVE: పార్లమెంట్‌ ముందు నిర్మలమ్మ బడ్జెట్‌ పద్దు.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్

Budget 2024 Live

Budget 2024 Live

Budget 2024 LIVE: ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పార్లమెంట్‌ ముందుకు వచ్చింది.. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది 6వ సారి.. దీంతో.. వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్‌ రికార్డును ఆమె సమం చేశారు.. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూనే.. తిరిగి మేం అధికారంలోకి వస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు.. తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు నిర్మలా సీతారామన్

The liveblog has ended.
  • 01 Feb 2024 12:02 PM (IST)

    సామాన్యుడికి ఊరట

    మధ్యంతర బడ్జెట్ లో సామాన్యుడికి ఊరట.. ఆదాయపన్ను శ్లాబులు యధాతథం.. ప్రత్యేక్ష, పరోక్ష పన్నుల్లో మార్పులు లేవు..

  • 01 Feb 2024 12:01 PM (IST)

    కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..

    కార్పొరేట్ ట్యాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గింపు..

  • 01 Feb 2024 11:59 AM (IST)

    కొత్త ట్యాక్స్ విధానం..

    కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశ పెట్టిన కేంద్రం.. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.. ఆదాయపన్ను చెల్లింపులను సులభతరం చేస్తాం..

  • 01 Feb 2024 11:54 AM (IST)

    టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్..

    ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు.. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌళిక వసతులు పెంపు..

  • 01 Feb 2024 11:53 AM (IST)

    మెట్రో విస్తరణ..

    మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు విస్తరణ..

  • 01 Feb 2024 11:51 AM (IST)

    మూడు కొత్త రైల్వే కారిడార్లు..

    మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతుంది.. కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెస్తున్నాం.. 41 వేల రైల్వే కోచ్ లను వందే భారత్ కింద మార్పు..

  • 01 Feb 2024 11:50 AM (IST)

    1000 కొత్త విమానాలు

    పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నాం.. 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం..

  • 01 Feb 2024 11:48 AM (IST)

    లక్ష కోట్లతో

    యువత కోసం లక్ష కోట్లతో కార్పస్ ఫండ్..

  • 01 Feb 2024 11:48 AM (IST)

    జీడీపీకి కొత్త అర్థం

    జీడీపీకి మోడీ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది..

  • 01 Feb 2024 11:47 AM (IST)

    ప్రజల ఆకాంక్షల మేరకే అయోధ్య..

    ప్రజల ఆకాంక్షల మేరకు అయోధ్యలో రామాలయం నిర్మించాం..

  • 01 Feb 2024 11:45 AM (IST)

    మత్య్సరంగంలో ఎగుమతులు పెరిగాయి..

    మత్య్సరంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం.. సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు రెండింతలు పెరిగాయి..

  • 01 Feb 2024 11:42 AM (IST)

    ఒకే దేశం- ఒకే పన్ను

    జీఎస్టీ ద్వారా ఒకే దేశం- ఒకే పన్ను విధానం అమలు చేస్తున్నాం.. ద్వవ్యోల్బణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం..

  • 01 Feb 2024 11:41 AM (IST)

    మరిన్ని మెడికల్ కాలేజీలు

    9-14 ఏళ్ల మధ్య బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. మరిన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తాం..

  • 01 Feb 2024 11:39 AM (IST)

    ఉచిత విద్యుత్..

    కోటి గృహాలకు సోలార్ రూఫ్ టాప్ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్..

  • 01 Feb 2024 11:37 AM (IST)

    ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం..

    ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం.. అంగన్ వాడీ సెంటర్లను అప్ గ్రేడ్ చేశాం.. అంగన్ వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాం.. మధ్య తరగతి ప్రజల కోసం గృహ ప్రణాళిక.. ఆశా వర్కర్లు అందరికి ఆయుష్మాన్ భారత్

  • 01 Feb 2024 11:36 AM (IST)

    వచ్చే ఐదేళ్లలో గణనీయమైన అభివృద్ది సాధిస్తాం..

    వచ్చే ఐదేళ్లలో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించబోతుంది.. భారత్ కు ఆకాశమే హద్దు.. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు 70 వేల గృహాలు..

  • 01 Feb 2024 11:33 AM (IST)

    మోడీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం..

    గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం బాగుపడింది.. 30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం.. మోడీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.. యూరప్ ఎకనామిక్ కారిడార్ దేశానికి గేమ్ ఛేంజర్ గా మారబోతుంది..

  • 01 Feb 2024 11:31 AM (IST)

    మహిళా సాధికారత సాధించాం..

    రికార్డు స్థాయిలో దేశంలో మౌలిక వసతులు కల్పించాం.. పేదలు, మహిళా సాధికారత, రైతుల మీద ఫోకస్ పెట్టాం.. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల యువతకు శిక్షణ.. స్టార్టప్ ల కోసం రూ. 43 వేల కోట్ల రుణాలు అందించాం..

  • 01 Feb 2024 11:28 AM (IST)

    ద్రవ్యోల్బణం తగ్గింది..

    ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది.. 4 కోట్ల రైతులకు పంటల బీమా అందిస్తున్నాం..

  • 01 Feb 2024 11:27 AM (IST)

    అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం..

    దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం.. బంధుప్రీతి, అవినీతిని మోడీ ప్రభుత్వం నిర్మూలించింది.. యువతకు నాణ్యమైన విద్యే మోడీ ప్రభుత్వ లక్ష్యం..

  • 01 Feb 2024 11:23 AM (IST)

    యువతకే పెద్దపీట

    యువత ఉపాధికి పెద్దపీట వేశం.. రైతులకు కనీస మద్దుత ధర పెంచుతూ వచ్చాం..

  • 01 Feb 2024 11:22 AM (IST)

    పేదరిక నిర్మూలనే మా లక్ష్యం..

    2047 నాటికి పేదరికం లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం.. పేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లు అందించాం.. రూ. 2.20 కోట్ల పూచీకత్తులేని రుణాలు అందించాం.. దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలు, 7 ఐఐటీలు నెలకొల్పాం..

  • 01 Feb 2024 11:18 AM (IST)

    ఉచితంగా ఆహార ధాన్యం

    80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం.. 25 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేసాం.. అన్నదాతల కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం అందించాం.. వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరినిచ్చింది..

  • 01 Feb 2024 11:16 AM (IST)

    రైతులకు పంటల బీమా

    4 కోట్ల రైతులకు పంటల బీమా అందిస్తున్నాం.. 34 లక్షల పేదలకు నేరుగా నగదు బదిలీ..

  • 01 Feb 2024 11:15 AM (IST)

    రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

    పీఎం విశ్వకర్మ యోజనద్వారా చేతి వృత్తుల వారిని ఆదుకుంటున్నాం.. అన్నదాతల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది..

  • 01 Feb 2024 11:14 AM (IST)

    కరోనా సంక్షోబాన్ని అధిగమించాం..

    కొత్త సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు పెరిగారు.. కరోనా సంక్షోబాన్ని దేశం అధిగమించింది..

  • 01 Feb 2024 11:12 AM (IST)

    అవినీతిని తగ్గించాం..

    పదేళ్లలో మోడీ తెచ్చిన సంస్కరణలకు ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిచ్చాయి.. ఆత్మనిర్భర్ భారత్ తో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యారు.. అవినీతిని గణనీయంగా తగ్గించాం.. పాలనలో పారదర్శకత పెంచాం..

  • 01 Feb 2024 11:11 AM (IST)

    బలోపేతంగా ఆర్థిక వ్యవస్థ..

    గత పదేళ్లలో అందరికి ఇళ్ల నిర్మాణానికి కృషి చేశాం.. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యింది..

  • 01 Feb 2024 11:08 AM (IST)

    మరోసారి అధికారంలోకి వస్తాం..

    ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లుగా ప్రభుత్వం పని చేస్తోంది.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తిరిగి అధికారంలోకి వస్తాం..

  • 01 Feb 2024 11:06 AM (IST)

    డిజిటల్ రూపంలో బడ్జెట్

    డిజిటల్ రూపంలో అందుబాటులోకి బడ్జెట్.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. అదే మా మత్రం..

  • 01 Feb 2024 11:03 AM (IST)

    ప్రాంరభమైన బడ్జెట్ సమావేశాలు..

    పార్లమెంట్ లో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

  • 01 Feb 2024 10:42 AM (IST)

    బడ్జెట్ కు ఆమోదం

    ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. కాసేపట్లో లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

  • 01 Feb 2024 10:18 AM (IST)

    పార్లమెంట్ కు బడ్జెట్ ప్రతులు..

    పీఎం కిసాన్ సాయం పెంపు?, ఆయుష్మాన్ భారత్ కవరేజీ పెంపు?, చమురు, వంటగ్యాస్ ధరల తగ్గింపుపైనా ఊహాగానాలు.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ సమస్యలను లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయం.. పార్లమెంట్ కు చేరుకున్న బడ్జెట్ ప్రతులు..

  • 01 Feb 2024 10:15 AM (IST)

    ఓటాన్ అకౌంట్ బడ్జెట్

    ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

  • 01 Feb 2024 10:15 AM (IST)

    కేంద్ర కేబినెట్ భేటీ

    కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్..

Exit mobile version