NTV Telugu Site icon

Buddha Venkanna : ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను

Buddha Venkanna

Buddha Venkanna

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా అని ఆయన అన్నారు. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారన్నారు. నా మాట చెల్లలేదు.. ఆవేదన గా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను అని ఆయన అన్నారు. ఇంకా నన్ను నమ్ముకున్న వారికి నేనేమీ చేస్తాను…నన్ను కార్యకర్తలు క్షమించాలని, 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్ర బాబు నాయుడు చిత్ర పటం కాళ్ళు కడిగానన్నారు.

Paris Olympics 2024: ఇమానే ఖలీఫ్ తర్వాత మరో వివాదాస్పద బాక్సర్..
అంతేకాకుండా..’నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు, చంద్ర బాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వెళితే నేను వెళ్లి అడ్డుకుని నిలబడ్డా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు వచ్చారో చెప్పాలి. ఐదేళ్ల వైసిపి దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశా. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడా. నా మీద మొత్తం 37 కేసులు పెట్టారు. 37 కేసులు టిడిపి పార్టీ కోసమే నేను పెట్టించుకున్న. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా… ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టిడిపిలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా. అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా.

Janhvi Kapoor: జీవితంలో ఆ పని అస్సలు చేయొద్దంది.. జాన్వీ సంచలన వ్యాఖ్యలు
నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్న. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. నేను చచ్చిపోయే వరకు టిడిపిలోనే ఉంటా. ఎంపీ కేసినేని చిన్ని మూడుసార్లు ఎంపీగా గెలవడం ఖాయం. కేశినేని నాని లాగా కేశినేని చిన్ని మాటల మనిషి కాదు… చేతల మనిషి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక బాధ్యతలు చంద్రబాబు నాయుడు కేశినేని చిన్ని పై పెట్టారంటే ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుంది. నా ఆవేదనను కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ‘ అని బుద్ధా వెంకన్న అన్నారు.

అనంతరం.. కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బిజెపికి ఇవ్వాల్సి వచ్చిందని, పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారని, ఆ విషయం నాకు తెలుసు అన్నారు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా అని, త్వరలోనే బుద్ధ వెంకన్న, నాగుల్ మీర్రాకు కూడా మంచి పదవులు వస్తాయన్నారు. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్య పడవద్దన్నారు.