Site icon NTV Telugu

Uttar Pradesh: బదౌన్‌లో స్కూల్ వ్యాన్‌ని ఢీకొన్న బస్సు, డ్రైవర్‌తో పాటు నలుగురు చిన్నారులు మృతి

New Project 2023 10 30t125440.429

New Project 2023 10 30t125440.429

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో స్కూల్ బస్సు, వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఓ డ్రైవర్‌ మృతి చెందారు. డజను మందికి పైగా చిన్నారులు కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ప్రమాద వార్త తెలియగానే చనిపోయిన చిన్నారుల ఇంట్లో విషాదం నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిల్లలను మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ కుమార్తె కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్కూల్ వ్యాన్‌లోనే ఉంది.

Read Also:IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!

రెండు వాహనాలు (బస్సు, వ్యాన్) పాఠశాలకు వెళ్లేవి. వారి డ్రైవర్లు వారి వారి ప్రాంతాల నుండి పిల్లలను మయూన్ పట్టణంలోని SRPS ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తీసుకువెళుతున్నారు. ఉసావా పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూన్-నబీగంజ్ రహదారిపై రెండు పాఠశాల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వ్యాన్‌ డ్రైవర్‌, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, డ్రైవర్‌తో సహా మొత్తం 5 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న డీఎం మనోజ్ కుమార్ సహా ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎం ఆస్పత్రి పాలకవర్గాన్ని ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను వైద్య కళాశాలకు తరలించారు. రెండు వాహనాలు అతివేగంతో రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయని చెబుతున్నారు.

Read Also:Viral : ‘అభి తో పార్టీ షురు హుయ్ హై’.. యువకులపై మీద పడిన డీజే

Exit mobile version