NTV Telugu Site icon

Budameru: బుడమేరు ఉగ్రరూపం.. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం..

Budameru

Budameru

Budameru: కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదంటున్నారు అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చోచ్చుకు వచ్చాయి వరద నీరు. దాంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు.

Beauty With Talent: ఈ అమ్మాయి ఏంట్రా బాబు.. ఇంత సులువుగా పాములను పట్టేస్తోంది..

3వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. పలు చోట్ల చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు. ఇక గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో.. బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు టీడీపీ నేతలు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో సమీక్షించారు కలెక్టర్ బాలాజీ. ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని, ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ బాలాజీ కోరారు.

Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?

Show comments