Site icon NTV Telugu

Kotha Manohar Reddy: రేపు బడంగ్‌పేట్‌ మున్సిపల్ గ్రౌండ్‌లో బీఎస్పీ బహిరంగ సభ

Kotha Manohar Reddy

Kotha Manohar Reddy

Kotha Manohar Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రేపు బడంగ్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో బహుజన సమాజ్ పార్టీ బహిరంగ సభ జరగనుందని.. ముఖ్య అతిథులుగా తెలంగాణ బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని మహేశ్వరం బీఎస్పీ పార్టీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి కోరారు. బీఎస్పీ గెలిస్తే నియోజకవర్గంలోని పేద ప్రజలకు 60 గజాల స్థలం ఇస్తానని వెల్లడించారు. ప్రతి డివిజన్‌లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Prof. Kodandaram : కాళేశ్వరం కుంగినట్లే.. కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

మహేశ్వరం నియోజక వర్గంలో నిరంతరాయంగా సాగుతున్న గడప గడప ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి దూసుకుపోతున్నారు. పల్లె బాట పట్టిన కొత్త మనోహర్ రెడ్డి ఒకవైపు తను చేసిన సేవ కార్యక్రమాలు.. మరొక వైపు అధికార ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి నిజమైన నాయకుడు రానున్నాడని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇక, మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు.

Exit mobile version