BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త ‘ఫైబర్ ఫ్రీడం ప్లాన్’ తీసుకొచ్చిన BSNL
- నెలకు రూ.1,111 ప్రత్యేక లాంచ్ ధరతో ప్లాన్ అందుబాటులోకి
- గరిష్ఠంగా 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్
- నెలకు ఏకంగా 5,000GB డేటా
- 25కి పైగా ప్రీమియం OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫైబర్ ఫ్రీడం ప్లాన్’ పేరుతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒకే కనెక్షన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. మరోవైపు దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. 26,300కు పైగా అదనపు 4G BTS సైట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. వీటి ద్వారా మరిన్ని పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు 4G సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
200 Mbps స్పీడ్:
ఫైబర్ ఫ్రీడం ప్లాన్‌ను ప్రత్యేక లాంచ్ ధరగా నెలకు రూ.1,111కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లో గరిష్ఠంగా 200 Mbps వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా నెలకు ఏకంగా 5,000GB డేటాను అందిస్తోంది. ఇంటర్నెట్తో పాటు 25కు పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఏయే ఓటీటీ సేవలను అందిస్తున్నారనే వివరాలను BSNL వెల్లడించలేదు. అలాగే రూ.1,111 ప్రత్యేక లాంచ్ ధర ఎంతకాలం అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కూడా కంపెనీ స్పష్టం చేయలేదు.
Also Read
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
సెల్ఫ్‌కేర్ యాప్:
ఫైబర్ ఫ్రీడం ప్లాన్‌తో పాటు బిఎస్ఎన్ఎల్ తన సెల్ఫ్‌కేర్ మొబైల్ అప్లికేషన్‌ను కూడా పూర్తిగా అప్డేట్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ‘BSNL Selfcare New’గా రీబ్రాండ్ చేసింది. ఈ యాప్ ద్వారా ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, పోస్ట్‌పెయిడ్, ల్యాండ్‌లైన్ బిల్లుల చెల్లింపు, ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్టేటస్ ట్రాకింగ్, డీఎన్డీ మేనేజ్మెంట్, పేమెంట్ హిస్టరీ వంటి సేవలను పొందవచ్చు. అంతేకాకుండా ఫైబర్ కనెక్షన్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది.
AI చాట్‌బాట్:
కొత్త BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌లో ఏఐ చాట్‌బాట్ సపోర్ట్, వాయిస్ సెర్చ్, ఒకే యాప్‌లో అనేక ఖాతాలను నిర్వహించే సదుపాయం కూడా అందిస్తోంది. దీంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన పలు సేవలను ఒకే చోట నుంచి నిర్వహించుకోవచ్చు. అదే యాప్‌లో BSNL ఎంటర్టైన్మెంట్ టీవీ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా మొబైల్లో లైవ్ టీవీ ఛానళ్లతో పాటు ఆన్-డిమాండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
This Independence Day, freedom comes with faster speeds and endless entertainment!
Introducing the NEW BSNL Fiber Super Plus OTT Plan-your all-in-one entertainment and internet upgrade.
Launch Offer: Get ₹88/- OFF every month for 6 months!
Enjoy:
* 200 Mbps High-Speed… pic.twitter.com/faGpVAZ17n
— BSNL India (@BSNLCorporate) August 7, 2026
తాజావార్తలు
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్‌లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు
-
E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
-
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!