NTV Telugu Site icon

BSc Nursing Notification: ఆర్టీసీ దవఖానాలో బీఎస్సీ నర్సింగ్‌.. అడ్మిషన్లు షురూ

Rtc Hospital

Rtc Hospital

BSc Nursing Notification: హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో గల నర్సింగ్‌ కాలేజీలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ విద్యా సంవత్సరంలో B.Sc. నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో BSc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్‌ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.

Read Also: Karnataka Cabinet: కర్ణాటకలో కొత్తగా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులై.. 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్‌ కాలేజీని 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ అనుమతి ఉంది. కన్వీనర్‌ కోటాలో 30 సీట్లు, యాజమాన్య కోటాలో 20 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు ఉంటాయి. ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తార్నాక దవాఖానకు ఆధునీకరణ పనులు చేపట్టారు.నర్సింగ్‌ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-68153333, 040-30102829 లేదా https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్‌ కాలేజీ ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చని వెల్లడించారు.